తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా సోకలేదని అబద్ధం చెప్పినందుకు కేసు!

కరోనా వైరస్​ విషయంలో ఓ జంట అబద్ధం చెప్పింది. చైనా నుంచి సింగపూర్​కు వచ్చిన దంపతులు తమకు వైరస్​ లేదని చెప్పగా.. అనుమానంతో ఆ దేశ వైద్య బృందం వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సింగపూర్​ యంత్రాంగం వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

Singapore charges man with virus for lying to health officials
కరోనా సోకినా లేదని బుకాయించిన సింగపూర్​ జంట

By

Published : Feb 27, 2020, 2:58 PM IST

Updated : Mar 2, 2020, 6:18 PM IST

కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో చైనా నుంచి వస్తోన్న ప్రయాణికులను నిశితంగా పరీక్షిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలో వుహాన్​ నుంచి సింగపూర్ వచ్చిన ఓ జంట వైరస్​ విషయంలో అబద్ధమాడింది. తమకు కరోనా వైరస్​ సోకలేదని ఆ దేశ వైద్యులకు నమ్మబలికింది. అనుమానం వచ్చిన వైద్య బృందం.. వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలింది.

ఈ​ విషయంలో తప్పుడు సమాచారమిచ్చారని ఆగ్రహించిన సింగపూర్​ అధికార యంత్రాంగం ఆ దంపతులపై కేసు నమోదు చేసింది. వారికి వైరస్​ సోకి ఎన్ని రోజులు అవుతుంది అనేదానిపై విచారణ చేపట్టారు అధికారులు. ఒకవేళ వారిపై అభియోగాలు రుజువైతే 7,150 యూఎస్​ డాలర్ల వరకు జరిమానాతో సహా ఆరునెలల జైలుశిక్ష విధిస్తామని తెలిపారు.

సింగపూర్​లో 100 కేసులు..

ఇప్పటిదాకా సింగపూర్​లో సుమారుగా 100 మందికి కరోనా వైరస్​ సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. వేగంగా విస్తరిస్తోన్న వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశంలో సందర్శకుల ప్రవేశాలపై ఆంక్షలు విధించారు.

ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా ధాటికి.. ఇప్పటికే చైనాలో 2,800 మంది వరకు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 81 వేలకు పైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:విషాదంతో ముగిసిన ట్యూస్​డే ఫ్యాట్​ ఉత్సవాలు

Last Updated : Mar 2, 2020, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details