తెలంగాణ

telangana

ETV Bharat / international

'కర్తార్​పుర్​ సాహిబ్​కు బంగారు పల్లకీ బహూకరణ' - కర్తార్​పుర్​ సాహిబ్​కు బంగారు పల్లకీ బహూకరించిన భారతీయ సిక్కులు

భారతీయ సిక్కులు 11 వందల మంది పాకిస్థాన్​లోని కర్తార్​పుర్ సాహిబ్​ గురుద్వారాను దర్శించుకున్నారు. పంజాబ్​ గవర్నర్ చౌదరి సర్వార్ ఆధ్వర్యంలో అక్కడ బంగారు పల్లకీని ఏర్పాటుచేశారు. గురునానక్ 550 జయంతి వేడుకల కోసం వీరు పాక్ చేరుకున్నారు.

కర్తార్​పుర్ సాహిబ్​ గురుద్వారాను దర్శించుకున్న భారతీయ సిక్కులు

By

Published : Nov 5, 2019, 2:37 PM IST

Updated : Nov 5, 2019, 5:47 PM IST

కర్తార్​పుర్​ సాహిబ్​కు బంగారు పల్లకీ బహూకరించిన భారతీయ సిక్కులు

గురునానక్​ 550వ జయంతి సందర్భంగా భారతీయ సిక్కులు పాకిస్థాన్​లోని కర్తార్​పుర్ సాహిబ్​ గురుద్వారాను దర్శించుకున్నారు. పంజాబ్​ గవర్నర్ చౌదరి సర్వార్ ఆధ్వర్యంలో అక్కడ బంగారు పల్లకీని ఏర్పాటుచేశారు. నన్​కనా సాహిబ్​లో జరిగే గురునానక్​ దేవ్​ 550 జయంతి వేడుకల్లో పాల్గొనడం కోసం భారత్​ నుంచి 1100 మంది సిక్కు భక్తులు తరలి వెళ్లారు. వీరు కర్తార్​పుర్ సాహిబ్​గా పిలుచుకునే గురుద్వారా దర్బార్​ సాహిబ్​ను దర్శించుకున్నారు.

నడవాతో సమస్య పరిష్కారం..

కర్తార్​పుర్​ నడవాను గురునానక్​ జయంతి సందర్భంగా.. ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. పాకిస్థాన్​లోని నన్​కనా సాహిబ్‌ గురుద్వారాను పంజాబ్‌ రాష్ట్రం గురుదాస్‌పుర్‌జిల్లాలోని డేరాబాబా నానక్‌ గురుద్వారాను కలుపుతూ భారత్‌-పాక్‌ ప్రభుత్వాలుకర్తార్‌పుర్‌ కారిడార్‌ను నిర్మించాయి.

కర్తార్​పుర్​ నడవా ఇరుదేశాలను దగ్గర చేసేందుకు తోడ్పడుతుందని పంజాబ్​ గవర్నర్​ చౌదరీ సర్వార్ అభిప్రాయపడ్డారు.

ఎన్​ఓసీ తప్పనిసరి

కర్తార్​పుర్​ సాహిబ్​ దర్శనం విషయంలో.. భారతీయులకు తప్ప మిగతా విదేశీ సిక్కులకు అందరికీ పాక్ అంతర్గత మంత్రిత్వశాఖ జారీ చేసే 'నిరభ్యంతరం పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్-ఎన్​ఓసీ)'ను తప్పనిసరి చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టూర్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

"అమెరికా, కెనడా, ఐరోపా దేశాల సిక్కులకు లాహోర్ పర్యటన కోసం పర్యటక వీసా జారీ చేశాం. పవిత్ర ప్రదేశాల దర్శనాల విషయంలో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయి. అందువల్ల టూర్​ ఆపరేటర్లు కచ్చితంగా పాక్ అంతర్గత మంత్రిత్వశాఖ జారీచేసే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్​'ను తప్పనిసరి చేయాలని ఆదేశించాం."

- ఓ అధికారి

ఇదీ చూడండి: 'పారిస్​' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ

Last Updated : Nov 5, 2019, 5:47 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details