తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్! - indian tv channels off in nepal

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నేపాల్​లో నిలిపివేశారు. ఈ మేరకు అక్కడి కేబుల్​ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్​ఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే నిలిపివేతపై నేపాల్​ సర్కార్​ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు.

signals for Indian news channels have been switched off in the country.
భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

By

Published : Jul 9, 2020, 8:36 PM IST

Updated : Jul 10, 2020, 1:33 AM IST

నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు కేబుల్‌ ఆపరేటర్లు. దూరదర్శన్​ ప్రసారాలను మాత్రం కొనసాగిస్తున్నట్లు నేపాల్​ కేబుల్​ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్​ఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇందుకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

భారత్​కు చెందిన వార్తా ఛానల్స్ ఓలి శర్మకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వాటిని నిషేధించాలని ఆ దేశ ఉపప్రధాని నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయమే ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు భారత్​కు చెందిన టీవీ ప్రసారాలను నిషేధించినట్లు తెలిస్తోంది.

స్వచ్ఛందానే..

కేబుల్ ఆపరేటర్లు మాత్రం తామే స్వచ్ఛందంగా ప్రసారాలను ఆపేశామని ప్రకటించారు. ఈ విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత్​ తన స్పందనను ఇంకా తెలియజేయలేదు.

కొత్త అనుమానాలు..

కొన్ని రోజులుగా భారత్, నేపాల్ మధ్య సరిహద్దు విభేదాలు రాజుకొంటున్నాయి. భారత్​లోని కొన్ని భూభాగాలను తనవిగా పేర్కొంటూ కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది నేపాల్​. అంతేకాకుండా భారత్​కు వ్యతిరేకంగా ఓలి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఓలి భవితవ్వంపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చూడండి: నేపాల్​ అధికార పార్టీలో చీలిక తప్పదా?

Last Updated : Jul 10, 2020, 1:33 AM IST

ABOUT THE AUTHOR

...view details