Siberia igloo festival: రష్యాలో ప్రతి ఏటా శీతాకాలంలో నిర్వహించే ఇగ్లూ పోటీలు ఈసారి ఉత్సాహంగా సాగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సముద్రంలో ఏర్పడిన మంచు బ్లాకులను తీసుకొచ్చి ఒక దానిపై ఇంకొకటి ఆడుతూ.. పాడుతూ అమర్చి.. ఇగ్లూలను నిర్మించారు. సైబీరియాలోని ఓబీ సముద్ర తీరం ఈ ఇగ్లూ ఫెస్టివల్‌కు వేదికైంది.
Igloo festival Snow structures
మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అతిశీతల ప్రాంతాల్లో.. ఎస్కిమోలు అనే స్థానిక ప్రజలు నివసించే మంచు గృహాలను ఇగ్లూలు అంటారు. సాధారణంగా ఇగ్లూ పైకప్పుపై కీస్టోన్ను అమరుస్తారు. అది సరిగా ఉంటే.. వేడి లోపలికి వెళ్లదు. తద్వారా ఇగ్లూ కరగకుండా ఉంటుంది.
"ఇగ్లూను నిర్మించడానికి ఒక సాంకేతికత విధానం ఉంది. మంచు బ్లాకులను సరిగ్గా కత్తిరించాలి. అవన్నీ ఖాళీలు లేకుండా అమర్చాలి. ముఖ్యంగా కీస్టోన్ను అమర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండ్రపు ఆకారంలో ఇగ్లూ నిర్మించడం చాలా కష్టం. అందుకే పాల్గొన్నవారు చాలా మంది గుడ్డు ఆకారంలో నిర్మించారు."
-వ్యాచెస్లావ్ గోర్యునోవ్, నిర్వాహకులు