తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ ప్రధానిగా షేర్ బహదూర్ ప్రమాణం - నేపాల్ రాజకీయ సంక్షోభం వార్తలు

నేపాల్‌ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియమితులయ్యారు. రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉంది.

NEPAL
నేపాల్​ ప్రధాని

By

Published : Jul 13, 2021, 4:05 PM IST

Updated : Jul 13, 2021, 9:06 PM IST

నేపాల్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా.. ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఈ మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. రాత్రి 8 గంటల సమయంలో దేవ్​ బాతో ప్రమాణస్వీకారం చేయించారు.

షేర్ బహదూర్​ను ప్రధానమంత్రిగా నియమించాలని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం.. రాష్ట్రపతిని సోమవారమే ఆదేశించింది. మేలో పార్లమెంటును రద్దు చేస్తూ.. రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జులై 18 సాయంత్రం 5 గంటలకు కొత్త పార్లమెంటును సమావేశ పర్చాలని రాష్ట్రపతికి దిశానిర్దేశం చేసింది.

ఈ మేరకు దేవ్‌ బాను ప్రధానిగా నియమిస్తూ.. విద్యాదేవి భండారీ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 30 రోజుల్లో ఆయన పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 13, 2021, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details