లండ్‌న్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను పరారీలో ఉన్నట్టు ప్రకటించింది పాకిస్థాన్. ఆయన్ను అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.
షరీఫ్‌కు ఇచ్చిన నాలుగు వారాల బెయిల్.. గతేడాది డిసెంబర్లోనే పూర్తయిందని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ సలహాదారు షాజాద్ అక్బర్ వెల్లడించారు. అందువల్లే షరీఫ్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్టు షాజాద్ వ్యాఖ్యానించారని డాన్ వార్తా పత్రిక పేర్కొంది.
పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ చికిత్స కోసం బెయిల్‌పై లండన్ వెళ్లారు. ఈ క్రమంలో చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికను సమర్పించాలని లాహోర్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నివేదికను సమర్పించారు షరీఫ్ తరఫు న్యాయవాదులు. అయితే తనకు బీపీ, కిడ్నీ, మధుమేహం సమస్యలు ఉన్నాయని.. కరోనా వైరస్ నేపథ్యంలో బయటకు రావొద్దని వైద్యులు సూచించినట్టు కోర్టుకు విన్నవించారు షరీఫ్.