పాకిస్థాన్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి - పాకిస్థాన్లో బాంబు పేలుడు
పాకిస్థాన్లో భారీ పేలుడు
10:47 October 21
పాకిస్థాన్లో భారీ పేలుడు
పాకిస్థాన్లోని కరాచీ గుల్షాన్ ఈ ఇక్బాల్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కరాచీ విశ్వవిద్యాలయం మస్కాన్కు ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఈ పేలుడు జరిగింది. అయితే.. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమీప భవనాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
పేలుడు ఏ విధంగా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Last Updated : Oct 21, 2020, 11:09 AM IST