ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఓ జాలర్ల పడవ... సరకు రవాణా నౌకను ఢీకొట్టింది. శనివారం జరిగిన ఈ ఘటనలో 17 మంది ఆచూకీ గల్లంతైంది.
ప్రయాణ సమయంలో చేపల పడవలో మొత్తం 32 మంది ఉండగా.. 15 మంది క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారికోసం స్థానిక మత్స్యకారులు, నేవీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.