తెలంగాణ

telangana

ETV Bharat / international

వరుస భూకంపాలు- రెండు గంటల్లో 22 సార్లు!

రెండు గంటల వ్యవధిలో 22 సార్లు భూకంపాలు.. తూర్పు తైవాన్​లో సంభవించాయి. భూకంపాల ధాటికి స్వల్ప స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

earthquakes
భూకంపాలు

By

Published : Jul 14, 2021, 7:43 PM IST

Updated : Jul 14, 2021, 8:22 PM IST

తైవాన్​ తూర్పు తీరాన్ని వరుస భూకంపాలు.. బుధవారం వణికించాయి. ఏకంగా 22 సార్లు భూమి కంపించిందని అక్కడి కేంద్ర వాతావరణ శాఖ(సీడబ్ల్యూబీ) తెలిపింది. ఉదయం 6:52 నుంచి రెండు గంటల వ్యవధిలోనే ఇవి ఏర్పడినట్లు చెప్పింది. ఈ భూకంపాల వల్ల పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.

మొదటి భూకంపం రిక్టర్​ స్కేలుపై 5.2 తీవ్రతతో సంభవించగా.. 5.9 కిలోమీటర్ల లోతులో భూకంపం ఉన్నట్లు సీడబ్ల్యూబీ చెప్పింది. మిగతావి 3.0 నుంచి 5.0 తీవ్రతతో సంభవించినట్లు తెలిపింది. భూకంపం కారణంగా హవేలియన్​ కౌంటీలో పలు భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: తండ్రి సాహస యాత్ర- కొడుకు కోసం బైక్​పై లక్షల కి.మీ...

Last Updated : Jul 14, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details