జపాన్లో వారం రోజుల వ్యవధిలోనే రెండో తుపాను విధ్వంసం సృష్టించింది. 'హేషిన్' ధాటికి అనేక ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. షీబా గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు గల్లంతవగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్యూషు ప్రాంతంలో మరో 37 మందికి తీవ్ర గాయాలైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ధాటికి అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడి కొన్ని ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి.