పాక్‌లో ఓవైపు కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతుండగా మరోవైపు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫలితంగా 310 మంది మరణించారు. వీరిలో 107 మంది చిన్నారులుండగా 135 మంది పురుషులు, 70 మంది మహిళలు ఉన్నారు. మరో 239 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అత్యధికంగా సింధు రాష్ట్రంలో 136 మంది మృతి చెందగా... ఖైబర్ పక్తుంఖ్వాలో 116, పంజాబ్‌లో 16, బలూచిస్థాన్‌లో 21, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 12, గిల్గిత్-బాల్టిస్థాన్‌లో 11 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.