తెలంగాణ

telangana

ETV Bharat / international

'దీపావళి వేళ చీకటి నుంచి వెలుగుల్లోకి..' - స్కాట్ మారిసన్ వార్తలు

దీపావళి పర్వదినం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలా కాకుండా ఈసారి జరపుకొనే పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగ విశిష్టత సూచించేట్లుగా ప్రస్తుతం యావత్తు ప్రపంచం చీకటి రోజుల నుంచి వెలుతురులోకి ప్రవేశిస్తోందని గుర్తుచేశారు.

Scott Morrison
స్కాట్‌ మోరిసన్‌

By

Published : Nov 13, 2020, 11:29 AM IST

కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ అభివృద్ధిని ఉద్దేశిస్తూ దీపావళి వేళ ప్రపంచం చీకటి నుంచి వెలుగులోకి ప్రవేశిస్తోందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వీడియో ద్వారా తన సందేశం అందజేశారు.

"చీకటిని పారదోలే ఈ పండుగ ప్రాశస్త్యాన్ని గురించి చాలా ఏళ్లుగా గుర్తుచేసుకుంటున్నాం. కానీ, ఎప్పుడూ అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. ఈసారి దీపావళికి ప్రత్యేకత ఉంది. ప్రతి దేశం కరోనా మహమ్మారి ప్రభావానికి గురైంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది జీవనోపాధిని కోల్పోయి దుర్భల పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇంతటి విపత్కాలంలోనూ ఒకరికొకరం అండగా నిలిచాం. మహమ్మారిపై పోరులో ముందున్న సిబ్బంది నుంచి స్ఫూర్తి పొందాం. ఈ ఏడాది పూర్తిగా చీకటిని చూశాం. కానీ, వెలుతురు క్రమంగా దాన్ని కమ్మేస్తోంది. ముందు మరింత ప్రకాశవంతమైన రోజులున్నాయి. దీపావళి జరుపుకుంటున్న ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు."

-స్కాట్ మోరిసన్

ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత ఆంటోనీ అల్బనీస్‌ సైతం ప్రజలకు దీపావళికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో దీపావళి ఇచ్చే సందేశం సరిగ్గా సరిపోతుందని గుర్తుచేశారు.

70 లక్షల మంది..

ఆస్ట్రేలియాలో దాదాపు 70 లక్షల మంది భారత సంతతి ప్రజలున్నారు. ఏటా ఆ దేశ పౌరసత్వం అత్యధికంగా పొందుతున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. గత ఏడాది 28 వేల మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరులుగా మారారు.

ఇదీ చూడండి:ఆంగ్​సాన్​ సూకీకి మోదీ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details