తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు

​​​​​​​చైనాలో విజృంభిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్​ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని మిలియన్​ డాలర్ల వ్యయంతో వ్యాక్సిన్​ అభివృద్ధికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఆరు వారాల్లో వైరస్​కు పరిష్కారం చూపుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Scientists race to develop vaccine for new coronavirus
కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు

By

Published : Feb 9, 2020, 2:27 PM IST

Updated : Feb 29, 2020, 6:08 PM IST

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు

చైనాలో మొదలైన కరోనా వైరస్​ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఉన్న శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇందుకు గానూ కొన్ని మిలియన్​ డాలర్ల వ్యయంతో వ్యాక్సిన్​ కనుగొనేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

కరోనా వల్ల ఇప్పటివరకు 800కు పైగా మరణించారు. 37 వేల కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ముందుగా జంతువులపై పరీక్షించి, అనంతరం మనుషులపై క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్​ విషయంలో అనేకమంది నిపుణుల బృందాలు వ్యాక్సిన్​ను త్వరితగతిన కనుగొనేందుకు పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పీడిస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్​ కనుగొనాలంటే ఆరునెలల సమయం చాలంటున్నారు.

"ఇప్పడు మాపై పెద్ద బాధ్యత ఉంది. ప్రస్తుతం ఎంతో ఒత్తిడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక బృందాలు ఈ మిషన్​లో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో ఏదో ఒకటి విజయవంతమౌతుంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు సాయపడుతుందని ఆశిస్తున్నాను."

-కీత్ చాపెల్, సీనియర్ పరిశోధకుడు

చైనాలోని వుహాన్​ ప్రాంతం ​నుంచి ఈ వైరస్​ వ్యాపించిందని తెలుస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

సీఈపీఐ నేతృత్వంలోనే...

పశ్చిమ ఆఫ్రికాలో గతంలో ఎబోలా వైరస్​ కారణంగా 11వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బయోటెక్నాలజీ పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు 2017లో కొయిలేషన్ ఫర్​ ఎపిడెమిక్​ ప్రిపేర్డ్​నెస్​ ఇన్నోవేషన్స్​(సీఈపీఐ) ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంస్థ నేతృత్వంలోనే కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మిషన్​లో భాగంగా వ్యాక్సిన్​ను వేగవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో.. సీఈపీఐ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు ప్రాజెక్టులకు కొన్ని మిలియన్​ డాలర్లను వెచ్చిస్తోంది. మరిన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలకూ పిలుపునిచ్చింది. 16 వారాల్లో క్లినికల్​ టెస్టింగ్​ ప్రారంభించాలనే లక్ష్యంతో ముందడుగేస్తోంది.

వ్యాక్సిన్ కనుగొనకముందే వైరస్​ మాయం..

గతంలో 2002-2003 ప్రాంతంలో సార్స్​ వైరస్​ వ్యాప్తి చెందినప్పుడు.. వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే వైరస్​ అంతమైంది. వైరస్​ వ్యాప్తి అంతమైనప్పటికీ వ్యాక్సిన్​ను కనుగొనే ప్రయత్నాలు కొనసాగాలని పరిశోధకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:'అంబానీ' ఒకప్పుడు ధనవంతుడు.. ఇప్పుడు కాదు!

Last Updated : Feb 29, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details