తీవ్రస్థాయి కొవిడ్-19 వల్ల ఊపిరితిత్తుల్లో జరిగే నష్టాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దెబ్బతిన్న ఊపిరితిత్తుల కణజాలాన్ని చిత్రీకరించడానికి వీరు హై రిజల్యూషన్ ఇమేజింగ్ తో కూడిన వినూత్న విధానాన్ని ఉపయోగించారు.
కరోనా మహమ్మారికి చికిత్స చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు జర్మనీ శాస్త్రవేత్తలు. గాటింగెన్ విశ్వవిద్యాలయ చేపట్టిన ఈ పరిశోధనలో ఒక వినూత్న ఎక్స్ రే విధానాన్ని కనుగొన్నారు. ఇది కరోనా వైరస్ తో దెబ్బతిన్న ఊపిరితిత్తులను త్రీడీ, అత్యధిక రిజల్యూషన్ తో చీత్రీకరించడానికి వీలు కల్పించింది.