తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ మంత్రాంగం..'కశ్మీర్'​పై ఓఐసీ భేటీకి ప్రణాళిక - సౌదీ మంత్రాంగం..'కశ్మీర్'​పై ఓఐసీ భేటీకి ప్రణాళిక

కశ్మీర్​ అంశంపై మద్దతు కోసం చూస్తోన్న పాకిస్థాన్​ను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది సౌదీ అరేబియా. కశ్మీర్​ సమస్యపై చర్చించేందుకు ఇస్లామిక్​ సహకార సంస్థ (ఓఐసీ) సభ్య​ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇటీవల పాక్​లో పర్యటించిన సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్​ ఫైసల్​ బిన్​ ఫర్హాన్​ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఓఐసీ సమావేశంపై ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు పాక్​ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ.

Saudi plans OIC foreign ministers' meeting on Kashmir
సౌదీ మంత్రాంగం..'కశ్మీర్'​పై ఓఐసీ భేటీకి ప్రణాళిక

By

Published : Dec 30, 2019, 5:42 AM IST

కశ్మీర్​ అంశంపై చర్చించేందుకు 'ఇస్లామిక్​ సహకార సంస్థ (ఓఐసీ)​' సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తోంది సౌదీ అరేబియా. ఓఐసీ స్థానంలో సౌదీ నేతృత్వంలో మరో నూతన సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల.. మలేషియాలో నిర్వహించిన సదస్సును పాకిస్థాన్​ బహిష్కరించింది. ఈ క్రమంలో పాకిస్థాన్​ను సంతృప్తి పరిచేందుకు కశ్మీర్​ అంశాన్ని ముందుకు తెస్తోంది సౌదీ.

కశ్మీర్​లో మానవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఓఐసీ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఎదిరుచూస్తున్నట్లు స్పష్టం చేశారు పాక్​​ విదేశాంగ మంత్రి మహమ్మూద్​ ఖురేషీ. కశ్మీర్​ సమస్య, నియంత్రణ రేఖ వెంట భారత్​ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయంపై తగిన వేదికల్లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు.

మలేషియా సదస్సుపై పాకిస్థాన్​కు వివరించేందుకు ఇటీవలే పాక్​లో పర్యటించారు.. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్​ ఫైసల్​ బిన్​ ఫర్హాద్​​. ఈ సందర్భంగా కశ్మీర్​ సమస్య, ఆర్టికల్​ 370 రద్దు, భారత్​లోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​ వంటివి చేపట్టారని.. ఫైసల్​కు వివరించినట్లు వెల్లడించారు ఖురేషీ.

2020 ఏప్రిల్​లో..

కశ్మీర్​ అంశంపై చర్చించేందుకు ఓఐసీ మంత్రుల స్థాయి సమావేశం పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2020, ఏప్రిల్​లో నిర్వహించే అవకాశం ఉంది.

ఓఐసీ..

ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​లో పాకిస్థాన్​ సహా.. 57 ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయి. ఓఐసీని 1969లో ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం గళం వినిపించటం, ముస్లిం దేశాల మధ్య శాంతి, సామరస్యతను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.పాకిస్థాన్​కు ఓఐసీ ఎంతో మద్దతుగా నిలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details