శత్రుదేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చైనా మాస్టర్ ప్లాన్ రచించింది. దేశ వాయువ్య ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకల నమూనాలను, వాటిని ధ్వంసం చేసేందుకు కావాల్సిన యంత్రాలను ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. భవిష్యత్తులో యుద్ధం వస్తే, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు చైనా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అమెరికా కొలరాడో ఆధారిత మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ బయటపెట్టింది.
వాయువ్య జిన్జియాంగ్లోని రుయేకియాంగ్ ప్రాంతంలో చైనా ఈ కార్యకలపాలు సాగిస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.