తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు అమెరికా సహకారంపై పాక్ ఆందోళన! - భారత్​ గగనతలం

భారత్​కు అమెరికా అందించబోయే సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్థాన్. ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్​కు సమకూరే నూతన వ్యవస్థ పరిస్థితిని మరింత అస్థిరపరుస్తుందని వ్యాఖ్యానించింది.

bharat
భారత్​కు సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థపై పాక్ ఆందోళన!

By

Published : Feb 14, 2020, 6:23 AM IST

Updated : Mar 1, 2020, 6:55 AM IST

దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అమెరికా నుంచి సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థను భారత్​ కొనుగోలు చేయడంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఇప్పటికే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో భారత్​కు సమకూరే గగనతల రక్షణ వ్యవస్థ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉందని ఆరోపించింది.

పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆయేషా ఫరూఖీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

"ఇంత సమర్థవంతమైన ఆయుధసంపత్తిని భారత్​కు అమ్మడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిస్థితులు మరింత అస్థిరంగా ఉండేందుకు అవకాశం కన్పిస్తోంది. పాక్ సహా దక్షిణాసియాలో వ్యూహాత్మక సమతూకానికి అమెరికా నిర్ణయం విఘాతం కలిగించింది. పాక్ పట్ల భారత రాజకీయ, మిలిటరీ నేతలు అనుసరిస్తున్న వైఖరి అంతర్జాతీయ సమాజానికి తెలుసు. ఆయుధాల కొనుగోలు రేసులో దక్షిణాసియా నిలవలేదు."

-ఆయేషా ఫరూఖీ, పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

1.9 బిలియన్ డాలర్ల ధరకు భారత్​కు సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థను అందించేందుకు ఆమోదించింది అమెరికా. తమ గగనతల రక్షణ వ్యవస్థ, సైనిక వ్యవస్థలను ఆధునీకీకరించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఇదీ చూడండి:ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు

Last Updated : Mar 1, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details