తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ - దక్షిణ కొరియాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. వైరస్​ను జయించాయని అనుకున్న దేశాల్లో మళ్లీ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

S. Korea reports largest virus jump since March
ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

By

Published : Aug 16, 2020, 2:11 PM IST

కరోనాను జయించిన దేశాల్లో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. దక్షిణ కొరియాలో తాజాగా 279 మంది బాధితులను గుర్తించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో 253 మంది సియోల్​ నగరం నుంచే కావటం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,318కి ఎగబాకింది. ఇప్పటివరకు 305 మంది మృతి చెందారు.

మతపరమైన కార్యక్రమాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ప్రజలు సమూహంగా ఉండటం వల్ల కేసులు వెలుగుచూస్తున్నట్లు భావిస్తున్నారు.

న్యూజిలాండ్​లో మళ్లీ...

న్యూజిలాండ్​లో దాదాపు 100 రోజుల తర్వాత.. వరుసగా రెండు, మూడు రోజుల నుంచి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం 13 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో 12 మంది ఆక్లాండ్​ నగరం చెందిన వారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి విదేశాల నుంచి రాగా అతడిని క్వారంటైన్​లో​ ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నగరంలో మొత్తం 49 మంది మహమ్మారి బారిన పడ్డారు.

పాకిస్థాన్​లో

పాకిస్థాన్​లో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 670 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం 6,168 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2,88,717 మంది బాధితులు ఉన్నారు.

ఇదీ చూడండిఎల్లలు దాటిన 'స్వాతంత్ర్య' భారత సంబరం!

ABOUT THE AUTHOR

...view details