తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​పై కరోనా పంజా- దక్షిణ కొరియాలో మళ్లీ గుబులు - latest international news

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్​ ప్రభావం తగ్గిందని భావించిన దక్షిణ కొరియాలో కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. సింగ్​పూర్​లో ఒక్కరోజే 500 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్​లోనూ వైరస్​ తీవ్రత పెరిగింది.

S Korea has another 39 cases linked to warehouse
దక్షిణకొరియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : May 30, 2020, 5:05 PM IST

కరోనా ప్రభావం తగ్గిందని భావించిన దక్షిణ కొరియాలో రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 39 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ కేసులన్నీ రాజధాని సియోల్ ప్రాంతంలోనే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓ ఈ-కామర్స్​ గోదాములో పనిచేసే వారి ద్వారా వైరస్​ వాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 11 వేల 441 కేసులు నమోదు కాగా, 269 మంది ప్రాణాలు కోల్పోయారు.

60 లక్షలకు పైగా..

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,48,870కి చేరింది. మరణాల సంఖ్య 3,67,229కి పెరిగింది. వైరస్​ బారినపడి ఇప్పటివరకు 26,72,855 మంది కోలుకున్నారు. ఒక్క అమెరికాలోనే వైరస్​ బాధితుల సంఖ్య 17,93,530గా ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధికంగా లక్షా 4వేల మందికిపైగా చనిపోయారు.

రష్యాలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 3,96,575 మందికి వైరస్​ సోకింది. 4,555 మంది మృత్యువాతపడ్డారు.

సింగపూర్​లో 500 కేసులు

సింగపూర్​లో కొత్తగా 500 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా వసతి గృహాలలో నివసిస్తోన్న విదేశీ కార్మికులే ఉన్నారు. మొత్తం కేసుల సంఖ్య 34,366కి చేరింది. చాంగి జైలులోని ముగ్గురు ఖైదీలు, వైద్య సిబ్బందిలోని ఓ నర్సుకు శుక్రవారం పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు.

చైనాలో కొత్తగా ఆరు కేసులు..

చైనాలో కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురికి లక్షణాలు లేకున్నా పాజిటివ్​గా తేలింది. ఈ తరహా కేసులు చైనాలో ఇప్పటి వరకు 400కు పైగా నమోదయ్యాయి. అందులో 330కి పైగా వైరస్ కేంద్ర బిందువైన వుహాన్​కు చెందినవే. ఇప్పటివరకు చైనాలో 82,999 కేసులు నమోదు కాగా, 4634 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాక్​లో 73 మంది మృతి..

పాకిస్థాన్​లో 24 గంటల్లో 73 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన 2,429 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 66,457కు చేరింది. మృతుల సంఖ్య 1,395కి పెరిగింది. మాదక ద్రవ్యాల నియంత్రణ సహాయ మంత్రి షెర్యార్ ఆఫ్రిదీకి పాజిటివ్​గా తేలింది. స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details