రష్యాలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరణాలూ అదే రీతిలో నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యా రోజురోజుకూ అధికమవుతోంది. ఫలితంగా.. పడకలు దొరక్క బాధితులు ఇక్కట్లు పడుతున్నారు. వైరస్ సోకి రోజులు గడుస్తున్నా ఆస్పత్రుల్లో చేరలేకపోతున్నారు. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 81 శాతం ఆస్పత్రుల బెడ్లు నిండిపోయాయి.
ఆస్పత్రుల కారిడార్లలోనే వందలాది రోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. మృతదేహాలను నలుపు రంగు ప్లాస్టిక్ బ్యాగుల్లో బయట పోగుచేస్తున్నారు. బయట అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. ఇలాంటి భయానక చిత్రాలు.. బాధితులను కలవరపెడుతున్నాయి.
అక్టోబర్ 1 నుంచి ప్రతి లక్ష మందిలో వెలుగుచూస్తున్న కొత్త కేసుల సంఖ్య రెట్టింపైనట్లు ప్రభుత్వం తెలిపింది. రష్యాలో మొత్తం కేసులు 20 లక్షలు దాటిపోయాయి. మరణాల సంఖ్య 35 వేలను అధిగమించింది.
సామూహిక టెస్టులు..