కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌వీ వ్యాక్సిన్.. 91 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని లాన్సెట్ స్టడీ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్‌పై చేసిన మూడో దశ ట్రయల్స్‌తోపాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పుత్నిక్‌వీ టీకా సమర్ధతని లెక్కగట్టామని ఆ దేశ పరిశోధకులు వెల్లడించారు.
ట్రయల్స్‌లో పాల్గొన్న దాదాపు 20 వేల మందినుంచి సమాచారాన్ని విశ్లేషించినట్లు లాన్సెట్ తెలిపింది. ఎవ్వరిపైనా పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది.