ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాటికి 75 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు సంఖ్య 4లక్షల 20 వేలకు చేరుకున్నాయి.
అమెరికాలో మరో 3,572 కేసులు
అమెరికాలో తాజాగా 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు సంఖ్య 20 లక్షల 70 వేలకు చేరువైంది. మరో 113 మంది మృతి చెందగా.. ఫలితంగా లక్షా 15 వేల 243 మంది మృత్యువాతపడ్డారు.
రష్యాలో 8 వేల కేసులు
రష్యాలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8,779 మంది వైరస్ సోకింది. ఫలితంగా వైరస్ బాధితుల సంఖ్య 5,02,436కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6 వేల 532 మంది మహమ్మారికి బలయ్యారు.
అత్యధిక కేసులు
పాకిస్థాన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 5,834 మంది మృతికి వైరస్ సోకింది. ఒకరోజు ఇన్ని కేసులు నమోదవ్వటం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో మరో 101 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 19 వేలు దాటింది. వీరిలో 78,789 మంది చికిత్స పొందుతుండగా.. మరో 38,391 మంది కోలుకున్నారు.
నేపాల్‌లో 250 కేసులు..
నేపాల్లోనూ వైరస్ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 250మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,614కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 15కు చేరింది. అయినప్పటికీ కరోనా ఉద్ధృతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని ఆలోచనలో ఉంది నేపాల్. దీనిపై శుక్రవారం అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.