రష్యాలోని కజన్ ప్రాంతంలో ఓ పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు. 18 మంది విద్యార్థులు సహా 21 మంది గాయపడ్డారు.
పాఠశాలలో కాల్పులు- 8 మంది మృతి - russia seven killed in shooting
13:40 May 11
పాఠశాలలో కాల్పులు- 8 మంది మృతి
మృతి చెందినవారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులేనని టాటర్స్థాన్ రిపబ్లిక్ గవర్నర్ రుస్తమ్ మిన్నికనోవ్ తెలిపారు. వీరిలో నలుగురు బాలురు, ముగ్గురు బాలికలు కాగా ఒకరు అధ్యాపకులు. 19 ఏళ్ల ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పాఠశాల నుంచి అనేక మంది విద్యార్థులను తరలించామని.. ఇంకా కొంతమంది భవనంలోనే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో కజన్ ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు.
ఈ ఘటనలో 11 మంది మరణించినట్లు తొలుత స్థానిక మీడియా వార్తలు వెలువరించింది. అయితే ప్రభుత్వం మాత్రం 8 మంది చనిపోయినట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:కరోనా లెక్కలపై సౌమ్య స్వామినాథన్ ఆందోళన