కరోనా టీకా రెండో డోసు తీసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.
"ఈ హాల్లోకి ప్రవేశించే ముందు కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాను. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా. ఆశించడం కాదు.. మంచి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నా."
-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
తొలి డోసు మాదిరిగానే.. రెండో డోసు సైతం పుతిన్ బహిరంగంగా తీసుకోలేదు. మూడు వారాల క్రితం ఆయన తొలి డోసు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:పుతిన్.. కొవిడ్ టీకా తీసుకున్నారట!
రెండో డోసు తర్వాత కూడా తనకు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని పుతిన్ తెలిపారు. తొలి డోసు తీసుకున్న అనంతరం.. తన శరీరంలో ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు.
ఇదీ చదవండి:టీకా తీసుకున్నాక పుతిన్ ఏమన్నారంటే..