రష్యాలోని వ్లాదివోస్తోక్లో ఓ వ్యక్తి లాక్డౌన్ వేళ అల్ట్రామారథాన్ పూర్తిచేశాడు. అదెక్కడో ఆరుబయట ప్రాంతంలోనో, గ్రౌండ్లోనో కాదండోయ్.. ఇంట్లోనే. అదీ బెడ్రూమ్లో.! మారథాన్‌లో అనుభవం ఉన్న దిమిత్రి యాకుఖ్నీ.. సుమారు 10 గంటల 19 నిమిషాల పాటు మంచం చూట్టూ తిరిగి 100 కిలోమీటర్ల సుదీర్ఘ పరుగును పూర్తిచేశాడు.
ఎందుకంటే?
ఈ నెలలోనే యాకుఖ్నీ.. సహారా ఎడారిలో జరిగే 250 కిలోమీటర్ల డెస్ సేబుల్స్ అనే మారథాన్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే.. కరోనా కారణంగా ఈ పోటీలు సెప్టెంబర్‌కు వాయిదాపడ్డాయి. ఫలితంగా ఇతను ఇలా ఇంట్లోనే సాధన చేస్తున్నాడు. అయితే.. గత నెలలో బాల్కనీలో సాధన చేసిన ఓ ఫ్రెంచ్ వ్యక్తి ద్వారా స్ఫూర్తి పొందానంటున్నాడు యాకుఖ్నీ.