చాలా సినిమాల్లో అంతరిక్షం (Film in space), వ్యోమగాములు వంటి సన్నివేశాలు (Movies shot in space) చూస్తూ ఉంటాం. అయితే సెట్స్ డిజైన్ చేయడమో లేదా గ్రాఫిక్స్ రూపంలోనో వాటిని చూపిస్తుంటారు. దీనికి భిన్నంగా ఆలోచించిన రష్యాకు చెందిన ఓ చిత్రబృందం.. ఈ సన్నివేశాలను(Film in space) అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్ క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్.. మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో ప్రత్యేక వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఐస్) బయల్దేరివెళ్లారు.
మంగళవారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో.. కజకిస్థాన్‌లోని బైకొనుర్ నుంచి సోయుజ్ ఎంఎస్-19 అనే వ్యోమనౌకలో బయల్దేరి విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరారు.
12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి 'ఛాలెంజ్' సినిమా సన్నివేశాలను(Film in space) చిత్రీకరించనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు.. భూమి నుంచి ఓ సర్జన్(డాక్టర్) ఐఎస్‌ఎస్‌కు వెళ్లే సన్నివేశం(Movies shot in space) అది. డాక్టర్ పాత్రలో యులియా నటించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతేడాది ఆడిషన్ నిర్వహించారు. వీరంతా 3 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నారు.
గత మూడు నెలలుగా మేము సరికొత్త ప్రపంచంలో ఉన్నాం. ఇది కఠినంగా, క్లిష్టంగా ఉంది. నిద్ర పోవడానికి కూడా సమయం దొరకట్లేదు. భూమిపై చిత్రీకరణ అయితే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. జీవితం మారిపోయింది. అంతరిక్షం జీవితాలను మారుస్తుంది. దీనిలా మరేదీ ఉండదు."
--క్లిమ్ షిపెంకో, మూవీ డైరెక్టర్