తెలంగాణ

telangana

ETV Bharat / international

గుడ్​న్యూస్: ఈ నెల 12న తొలి కరోనా వ్యాక్సిన్‌

కొవిడ్​ మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్​ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న తరుణంలో రష్యా శుభవార్త తెలిపింది. టీకా తయారీలో మూడో దశ పరీక్షలను పూర్తి చేసి, ఈ నెల 12న వ్యాక్సిన్​ను రిజస్టర్​ చేయనున్నట్లు ప్రకటించింది.

RUSSIA WILL START FIRST CORONA VACCINE REGISTRATION ON AUG 12TH
12న తొలి కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌!

By

Published : Aug 9, 2020, 7:22 AM IST

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఈనెల 12న రష్యా అధికారికంగా రిజిస్టర్‌ చేయనుంది! మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో అన్ని దేశాలూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే... తాము చివరి దశ పరీక్షలను పూర్తిచేసి, వచ్చే బుధవారం తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయనున్నట్టు రష్యా ప్రకటించింది.

తొలి ప్రాధాన్యం వారికే..

ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది. 'గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్‌ చేస్తాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎంత భద్రమన్నది నిర్ణయించేందుకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం.' అని ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఒలెగ్‌ గ్రిడ్‌నేవ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:'కరోనా టీకా.. మాకే ముందుగా'- పంపిణీ సవాలే!

ABOUT THE AUTHOR

...view details