తెలంగాణ

telangana

ETV Bharat / international

టర్కీ చొరవ.. దౌత్య చర్చలకు రష్యా, ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రులు భేటీ! - ఉక్రెయిన్ విదేశాంగ చర్చలు

Russia-Ukraine conflict: టర్కీ తీసుకున్న చొరవతో ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. అంటల్యా డిప్లొమసి ఫోరం వేదికంగా మార్చి 10న శాంత చర్చలు జరిపేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సిద్ధమైనట్లు టర్కీ తెలిపింది.

Russia-Ukraine conflict
రష్యా, ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రుల భేటీ

By

Published : Mar 7, 2022, 10:17 PM IST

Russia-Ukraine conflict: ఉక్రెయిన్, రష్యా వివాదం ముగింపు కోసం మా దేశ అధ్యక్షుడు రెసెప్​ తైపీ ఎర్డోగాన్​ తీసుకున్న చొరవ, దౌత్య ప్రయత్నాల ఫలితంగా.. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్​, దిమిత్రీ కులేబాలు సమావేశం అయ్యేందుకు అంగీకరించారని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్​ కావుసోగ్లు సోమవారం వెల్లడించారు.

అంటల్యా డిప్రొమసీ ఫోరం వేదికగా మార్చి 10 న ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ఇందులో తాము భాగం అవుతాని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. ఈ ప్రయత్నాలు శాంతి, స్థిరత్వానికి దారి తీస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రష్యా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

రష్యాకు చైనా మద్దతు..

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తామన్న భారత్‌.. సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. ఇదే సమయంలో చైనా మాత్రం రష్యా తీరును ఖండించలేమని మరోసారి స్పష్టం చేసింది. రష్యా తమకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామి అని ఉద్ఘాటించింది. అయితే, అవసరమైన సమయంలో ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా వెల్లడించింది.

ఇదీ చూడండి:

రష్యా చేజారిన ఎయిర్​పోర్ట్- యుద్ధంలో 406 మంది పౌరులు మృతి

ABOUT THE AUTHOR

...view details