తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధరంగంలోకి మాజీ మిస్‌ ఉక్రెయిన్‌.. ఫొటోలు వైరల్​

Russia-Ukraine conflict: రష్యా దాడుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు సాధారణ పౌరులు స్వచ్ఛందంగా కదన రంగంలోకి దిగుతున్నారు. అలానే మాజీ మిస్‌ ఉక్రెయిన్‌ అనస్తాసియా లెన్నా కూడా ఈ బాటలోనే పయనిస్తోంది. దేశాన్ని కాపాడుకునేందుకు తుపాకీతో రణరంగంలోకి అడుగుపెట్టింది. ఆర్మీ వేషధారణలో, అసాల్ట్‌ రైఫిల్‌ చేతబట్టి ఓ బిల్డింగ్‌ వద్ద గస్తీ కాస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్​లో షేర్​ చేసింది.

By

Published : Mar 1, 2022, 7:13 AM IST

Miss Ukraine
మాజీ మిస్‌ ఉక్రెయిన్‌

Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తున్న రష్యా సైన్యం ఆ దేశంలోని ప్రధాన నగరాల్లోకి దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు సాధారణ పౌరులు స్వచ్ఛందంగా యుద్ధంలోకి దిగుతున్నారు. మాజీ మిస్‌ ఉక్రెయిన్‌ అనస్తాసియా లెన్నా సైతం ఈ బాటలోనే పయనిస్తోంది. దేశాన్ని కాపాడుకునేందుకు తుపాకీతో రణరంగంలోకి అడుగుపెట్టింది. ఆర్మీ వేషధారణలో, అసాల్ట్‌ రైఫిల్‌ చేతబట్టి ఓ బిల్డింగ్‌ వద్ద గస్తీ కాస్తున్న ఫొటోను ఈ అందాల బామ ఇన్‌స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. 'దాడి చేయాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్‌ సరిహద్దును దాటేవారు ప్రాణాలతో మిగలరు' అంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీకి మద్దతుగా అనస్తాసియా లెన్నా పలు పోస్టులు చేశారు. జెలెన్‌స్కీని గొప్ప, బలమైన నాయకుడు అని కొనియాడుతూ.. సైనికులతో ఆయనతో కలిసి నడుస్తున్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్ధతు కావాలని మరో పోస్టులో కోరింది. దేశంలోకి చొరబడుతున్న రష్యా సేనలను తికమకపెట్టేందుకు రోడ్ల వద్ద ఉన్న సైన్‌ బోర్డులను తొలగించాలని కోరింది. తద్వారా ఎటు వెళ్లాలో తెలియక శత్రు సైన్యం కన్‌ఫ్యూజ్‌ అయ్యి తప్పుదారి పట్టే అవకాశాలున్నాయని తెలిపింది.

రాజధాని కీవ్‌లోని స్లావిస్టిక్ యూనివర్శిటీ నుండి మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన అనస్తాసియా లెన్నా 2015లో మిస్‌ ఉక్రెయిన్‌ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. లెన్నా ఐదు భాషలు మాట్లాడగల ప్రతిభాశాలి. అనువాదకురాలిగానూ పనిచేసింది. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఆమెకు 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇదీ చూడండి:

ఈయూలో చేరేందుకు జెలెన్‌స్కీ సంతకం.. మరో విడత చర్చలు అక్కడే..!

ABOUT THE AUTHOR

...view details