స్పుత్నిక్-వీ టీకా రిజిస్ట్రేషన్, ప్రీక్వాలిఫికేషన్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు దరఖాస్తు సమర్పించింది రష్యా. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలో అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరింది. ఈ విషయాన్ని భారత్లోని రష్యా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.
'స్పుత్నిక్-వీ' ఆమోదం కోసం డబ్లూహెచ్ఓకు రష్యా దరఖాస్తు - Russia news
స్పత్నిక్-వీ టీకా రిజిస్ట్రేషన్, ప్రీక్వాలిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు రష్యా దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ను పరీక్షించి త్వరగా అనుమతిస్తే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని పేర్కొంది.
'స్పుత్నిక్-వీ' ఆమోదం కోసం డబ్లూహెచ్ఓకు రష్యా దరఖాస్తు
ప్రీక్వాలిఫికేషన్లో ఔషధాల నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తుంది. ప్రమాణాలకు అనుగుణంగా ఔషధం ఉన్నట్లు నిర్ధరిస్తే దానిని ప్రీక్వాలిఫైడ్ జాబితాలో చేర్చుతారు. అత్యవసర వినియోగానికి అనుమతిస్తారు.
అయితే ఈ ప్రక్రియను డబ్ల్యూహెచ్ఓ వేగవంతం చేసినట్లు రష్యా తెలిపింది. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తొలిదేశం తమదేనని పేర్కొంది. టీకా సురక్షితమని ఇప్పటికే నిర్ధరణ అయినట్లు పేర్కొంది.