తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో కరోనా విజృంభణ-ఒక్కరోజే 9వేల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. రష్యాలో ఇవాళ మరో 9 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 24 వేలు దాటింది. అలాగే ఇరాన్​లో గడిచిన 24 గంటల్లో 802 మందికి వైరస్​ సోకింది. మార్చి 10 తర్వాత ఆ దేశంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం.

By

Published : May 2, 2020, 8:47 PM IST

రష్యాలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 9 వేలకుపైగా కేసులు
రష్యాలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 9 వేలకుపైగా కేసులు

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మృత్యు విలయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 34 లక్షల 26 వేల మందికి పైగా వైరస్​ సోకింది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 2 లక్షల 40 వేలకు పైగా మరణాలు సంభవించాయి. 10,94,016 మంది బాధితులు కోలుకున్నారు.

రష్యాలో నేడు 9,623 కేసులు

గత కొంత కాలంలో రష్యాలో వైరస్​ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. శనివారం ఒక్కసారిగా ఉద్ధృత రూపం దాల్చింది.. ఇవాళ ఒక్కరోజే 9,623 మందికి వైరస్​ సోకింది. ఇటీవల కాలంలో రష్యాలో రికార్డు స్థాయిలో ఇంతమందికి వైరస్ సోకడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం 1,24,054 మంది మహమ్మారి బాధితులు ఉన్నారు. ఇవాళ కొత్తగా 53 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి మరణించినవారి సంఖ్య 1,222కు చేరింది. 15,013 మందికి వైరస్ నయమైంది.

అమెరికాలో మరో 3వేలు

అమెరికాలో ఇవాళ కొత్తగా మరో 3,054 మందికి వైరస్​ సోకింది. వీరితో కలిపి మొత్తం కొవిడ్​-19 బాధితుల సంఖ్య 11,34,084కు చేరింది. యూఎస్​లో ఇప్పటివరకు మొత్తం 65,888 మంది వైరస్​తో మృతి చెందారు.

స్పెయిన్​లో 276 మంది మృతి

స్పెయిన్​లో కరోనా మరణాలు ఆగట్లేదు. ఇవాళ 276 మంది మృతి చెందినట్లు అ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 2,579 మందికి వైరస్​ సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో మొత్తం కొవిడ్​-19 బాధితుల సంఖ్య 2,45,567కు చేరింది. వీరిలో 1,46,233 మంది రికవరీ అయ్యారు.

పాకిస్థాన్​లో మరో 1,297 కేసులు

పాకిస్థాన్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఎన్నడూ లేని విధంగా 1,297 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 18,114కు చేరింది. ఇప్పటి వరకు అక్కడ 32 మంది మాత్రమే మృత్యువాతపడటం గమనార్హం.

ఇరాన్​లో 24 గంటల్లో 802కేసులు

ఇరాన్​లో కొత్తగా 802 కేసులు నమోదయ్యాయి. మార్చి 10 నుంచి అప్పటి వరకు ఇవే అత్యల్ప కేసులని ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,448కి పెరిగింది. అక్కడ ఇప్పటి వరకు 6వేలకు పైగా మరణాలు సంభవించాయి.

మెక్సికోలో మరో 15 వందలకు పైగా కేసులు

మెక్సికోలో ఇవాళ 1,515 కేసులు నమోదయ్యాయి. మరో 113 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,972కు చేరింది. దేశంలో 20,739 మంది మహమ్మారి బాధితులు ఉండగా.. 12,377మంది ఆసుపత్రి నుంచి కోలుకున్నారు.

సౌదీ అరేబియాలో పెరుగుతోన్న కేసులు

సౌదీ అరేబియాలోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1362 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా 25,459 మంది మహమ్మారి బాధితులు ఉన్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 176 మంది మృతి చెందారు.

  • బెల్జియంలో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న కారణంగా ఆ దేశంలో మొత్తం 49,517 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 62 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 7,765 మంది మరణించారు.
  • నెదర్లాండ్స్​​లో గడిచిన 24 గంటల్లో 445 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలగా...మొత్తం బాధితుల సంఖ్య 40 వేలకు పెరిగింది. వీరిలో 4,987 మంది వైరస్​కు బలయ్యారు.
  • బ్రెజిల్​లో ఇవాళ 5 వందల మందికి పైగా కరోనా సోకింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 92,630 మంది బాధితులు ఉండగా.. 6,434 మంది మృతి చెందారు.
  • కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్​లో​ గత 28 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే వ్యాధి లక్షణాలు లేని 20 కొత్త కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి ఇలా వైరస్​ లక్షణాలు బయటపడకుండా పాజిటివ్​గా తేలిన వారి సంఖ్య హుబే రాష్ట్రంలో 989కి చేరింది.
  • దక్షిణ కొరియాలో ఇప్పటివరకు మొత్తం 10,780 మందికి వైరస్​ సోకగా.. 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,123 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 1407 యాక్టివ్​ కేసులున్నాయి.

ABOUT THE AUTHOR

...view details