తెలంగాణ

telangana

ETV Bharat / international

రోజూ సగటున 5 లక్షల మందికిపైగా కరోనా​! - #కరోనావైరస్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 6 కోట్ల 80 లక్షలు దాటింది. 15 లక్షల 53 వేలమంది మహమ్మారి ధాటికి బలయ్యారు.

Russia records 26,097 new COVID-19 cases in past 24 hours
రష్యాలో ఒక్కరోజే 26వేల కరోనా కేసులు

By

Published : Dec 8, 2020, 9:20 PM IST

ప్రపంచ దేశాల్లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. రోజూ సగటున 5 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడుతున్నారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6 కోట్ల 80 లక్షల 82 వేలు దాటింది. మృతుల సంఖ్య 15 లక్షల 54 వేలకు చేరువైంది. అయితే 4 కోట్ల 71 లక్షల 57 వేలమందికి పైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

రష్యాలో ఉగ్రరూపం

రష్యాలో కరోనా విస్తరణ కొనసాగుతోంది. వైరస్​ కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. తాజాగా 26,097 మందికి కొవిడ్​ సోకింది. మరో 562 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్​లోనూ వైరస్​ కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి. కొత్తగా 11,023 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 323 మంది మరణించారు.

  • ఉక్రెయిన్​లో తాజాగా 10,811 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 195 మంది చనిపోయారు.
  • పొలండ్​లో ఒక్కరోజే 8,312 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 411 మంది వైరస్​కు బలయ్యారు.
  • రొమేనియాలో కొత్తగా 7,439 వైరస్​ బారిన పడ్డారు. 213 మంది చనిపోయారు.
  • ఇండోనేసియాలో తాజాగా 5,292 కొవిడ్​ కేసులు బయటపడగా.. 133 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:'సరిహద్దు ఉద్రిక్తతపై భారత్​తో చర్చిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details