అమెరికాలో ఈ ఏడాది జనవరిలో జరిగిన క్యాపిటల్ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఓ సమావేశంలో ప్రస్తావించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా అల్లర్లు సృష్టించిన నిరసనకారులను ఎద్దేవా చేశారు. వారు అమెరికా కాంగ్రెస్‌కు షికారు చేయడానికి వచ్చారని వ్యాఖ్యానించారు. రష్యా ఎప్పుడూ అమెరికా శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నారు.
క్యాపిటల్ ఘటన నిరసనకారులపై పుతిన్ కామెంట్ - putin comment on us capitol
ఈ ఏడాది జనవరిలో జరిగిన యూఎస్ క్యాపిటల్ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. అల్లర్లు సృష్టించిన నిరసనకారులు అంతా ఆ ప్రాంతానికి షికారు చేయడానికి వచ్చారని అన్నారు.
క్యాపిటల్ ఘటన నిరసనకారులపై పుతిన్ కామెంట్
జనవరి 6న బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపడుతూ క్యాపిటల్‌కు చేరుకున్ననిరసనకారులు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి :మాస్క్ ధరించమన్నందుకు డ్రైవర్‌తో గొడవ