కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ ఔషధ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది రష్యా. ఆ దిశగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి (ఆర్డీఐఎఫ్) సీఈఓ కిరిల్ దిమిత్రివ్.
ఆర్డీఐఎఫ్, గమలేయా ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని ఆగస్టు 11న విడుదల చేసింది రష్యా. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి టీకాగా గుర్తింపు పొందింది. ఈ టీకా మంచి ఫలితాలు ఇస్తోందని ద లాన్సెట్ జర్నల్ కథనం ప్రచూరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి.
రష్యాకు చాలా ముఖ్యమైన భాగస్వామి భారత్. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముందున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లలో 60 శాతం భారత్‌లోనే తయారయ్యాయి. స్పుత్నిక్ -వీ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వం, ప్రముఖ ఔషధ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే ప్రముఖ కంపెనీలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాం.