తెలంగాణ

telangana

ఆగస్టు 3న రష్యా కరోనా టీకా రిలీజ్​!

By

Published : Jul 20, 2020, 7:54 PM IST

కరోనా వ్యాక్సిన్ కనుగొనే రేసులో రష్యా ముందంజలో నిలవనుందా? ఔననే అంటున్నారు ఆ దేశ ఆరోగ్య మంత్రి. ఆగస్టు 3 నుంచి వ్యాక్సిన్​ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

Russia coronavirus vaccine available to the public in August
ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి రష్యా కరోనా టీకా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేలాది మందిపై నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తైనట్లు తెలిపారు.

తొలి వ్యాక్సిన్​..!

అన్ని సక్రమంగా జరిగినట్లయితే... ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుంది. ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది. వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.

ఇదీ చూడండి:ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావడం కష్టమే!

ABOUT THE AUTHOR

...view details