60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది. రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు రెండు లక్షలమందికి పైగా టీకాను పంపిణీ చేశారు. వారిలో 60ఏళ్లు పైబడిన వారికి టీకాను అనుమతించలేదు. ఆ వయసు వారిపై ఈ టీకాను విడిగా పరీక్షించారు. ఈ ప్రయోగ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో రష్యా ఆరోగ్య శాఖ మంత్రి టీకాను అందరికీ అనుమతిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై 60ఏళ్లు దాటిన వారికి 'స్పుత్నిక్' - Health Minister Mikhail Murashko
రష్యాలో తయారైన కరోనా టీకా 'స్పుత్నిక్ వీ'ని ఇక నుంచి 60ఏళ్లు దాటిన వారికి కూడా ఇవ్వనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై 60ఏళ్లు దాటిన వారికి 'స్పుత్నిక్'
కాగా రష్యా ప్రభుత్వం 3 లక్షల స్పుత్నిక్ టీకాలను అర్జెంటీనాకు పంపారు. రష్యా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుండటంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇప్పటికే టీకాలను పంపారు. ఈ స్పుత్నిక్-వి టీకా ఎగుమతికి సంబంధించి రష్యా ఇప్పటికే చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికే అర్జంటీనా, బెలారస్‌లు తమ దేశాల్లో స్పుత్నిక్ టీకా వినియోగాన్ని అనుమతించారు.