కిలో ద్రాక్ష పండ్లు ఖరీదు ఎంత ఉంటుంది? సాధారణంగా రూ.100 లేదా రూ.200 వరకూ ఉండొచ్చు. కానీ ఒక్కో గుత్తి రూ.35 వేలు (450 డాలర్లు)కు(Ruby roman grapes price) అమ్ముతున్నారని తెలిస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.
జపాన్‌లో మాత్రమే పండే 'రూబీ రోమన్' రకం(Ruby Roman grapes in Japan ) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ప్రత్యేకత చాటుకుంటోంది. దీని రంగు, రుచి, పరిమాణాల్లో ఉన్న అరుదైన లక్షణాల కారణంగానే దీనికి ఇంత డిమాండ్ ఏర్పడింది. ద్రాక్షగుత్తిలో ఒక్కో పండు కనీసం 20 గ్రాముల బరువు, 30 మి.మీ. పరిమాణం ఉండడంతో పాటు నిర్దేశిత స్థాయిలో రంగు, చక్కెర శాతం ఉన్నవాటిని ప్రత్యేకంగా ఎంపిక చేసి అమ్మకానికి ఉంచుతారు.