తెలంగాణ

telangana

ETV Bharat / international

'బాస్కెట్​బాల్'​లో ఈ రోబోతో పోటీ పడగలరా!

జపాన్​లోని టోక్యోలో.. బాస్కెట్ బాల్​ క్రీడలో అదరగొట్టింది ఓ రోబో. త్రీ పాయింట్ షూట్​లో గురిచూసి బంతిని బాస్కెట్​లో వేసింది. అంతేకాదు ఇద్దరు ప్రొఫెషనల్​ ఆటగాళ్లను ఓడించింది.

బాస్కెట్ బాల్

By

Published : Apr 2, 2019, 8:02 AM IST

బాస్కెట్ బాల్
"ఊపిరితిత్తులు ఉండవులే.. గుండె బాధ లేదసలే... జిత్తుల మనిషి అల్పుడులే... యంత్రము ఓడదులే" అని ఓ సినిమా కవి అన్నట్టు రోబోలు భవిష్యత్తులో తామేంటో చూపిస్తాయనిపిస్తోంది. ప్రస్తుతం జపాన్​లోని టోక్యోలో ఓ రోబో బాస్కెట్​బాల్​ ఆటలో అదరగొట్టింది. త్రీ పాయింట్ షాట్​లో గురిచూసి బాస్కెట్​లో వేసింది ఈ చిట్టి రోబో. అంతేకాదు తనతో పోటీపడిన ఇద్దరు ప్రొఫెషనల్ ఆటగాళ్లను ఓడించింది.

ఆరడుగుల పదంగుళాల పొడవున్న ఈ రోబోకు క్యూ-3 అనే పేరు పెట్టారు. మొత్తం 8 సార్లు ప్రయత్నించి 5 సార్లు సరిగ్గా బాస్కెట్​లో బంతిని వేసింది. దీని దేహంలో సెన్సార్లు అమర్చారు శాస్త్రవేత్తలు. వీటి సాయంతో 3డీ ఆకారంలో ఉన్న బంతిని చేతిలోకి తీసుకుంది రోబో. చేతిలోని మోటర్ల సాయంతో బాస్కెట్​లో బంతిని వేసింది. సరైన కోణం, వేగంతో విసిరేలా ఈ రోబోకి ప్రోగ్రామ్ చేశారు శాస్త్రవేత్తలు.

ABOUT THE AUTHOR

...view details