అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు స్వదేశానికి వెళ్లిపోయిన క్రమంలో కాబుల్‌లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Kabul Airport) పూర్తిగా తాలిబన్ల(Afghanistan Taliban) చేతికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్క విమానం కూడా ఎగరలేదు. అయితే.. తాజాగా కాబుల్ విమానాశ్రయంలో కతార్ మిలిటరీకి చెందిన ఓ విమానం దిగినట్లు తాలిబన్ మీడియా ప్రతినిధి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కతార్ మిలిటరీ విమానానికి సంబంధించిన ఫొటోతో పాటు వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి. కాబుల్ విమానాశ్రయంలో మళ్లీ విమానం గర్జన వినిపించిందని రాసుకొచ్చారు.