పాక్‌లో రహదారి పక్కన బాంబు పేలడం వల్ల.. ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. బలూచిస్థాన్‌లోని ఓ రహదారిపై భవన నిర్మాణ కార్మికులు వాహనంలో వెళ్తుండగా ఈ పేలుడు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్ ప్రభుత్వం
ఎలా జరిగిందంటే.?
పంజాబ్(పాక్)కు చెందిన పైప్‌లైన్ కార్మికులు.. బలూచిస్థాన్ తాందోరిలోని ఓ ప్రాజెక్ట్‌లో పని చేసేందుకు వాహనంలో బయల్దేరారు. ఈ క్రమంలో సిబీ టౌన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. పేలుడు జరిగింది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన బాంబుపై నుంచి వాహనం వెళ్లడం వల్ల ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని స్థానిక డిప్యూటీ కమిషనర్ సయ్యద్ జాహిద్ షా చెప్పారు. సిబీ, తాందోరి నుంచి వచ్చిన కొందరు ఉగ్రవాదులే రిమోట్ కంట్రోల్ సాయంతో ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని చెప్పారు.
దాడికి కారకులైన వారిని పట్టుకునేందుకు.. ఘటనా ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి.
ఇదీ చదవండి:సోమాలియాలో బాంబు దాడి- 20మంది మృతి