సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ప్రజలపై దాడులు మానుకోవాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తిని సైన్యం పెడచెవిన పెట్టింది. గురువారం నాడు 10 మందిని కాల్చి చంపింది.
మయన్మార్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం సమావేశమైంది. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న ప్రజలపై అణచివేత ధోరణిని వెంటనే ఆపాలని విజ్ఞప్తిచేసింది. కానీ మరుసటి రోజే మయన్మార్ సైన్యం పది మంది ప్రజల్ని కాల్చి చంపింది.