కరోనా లాక్‌డౌన్‌తో పలు దేశాల్లో నిరుపేదలు ఉపాధి లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వియత్నాం హోచిమిన్‌సిటీలో వ్యాపారి హోంగ్ టాన్ ఆన్ ఈ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించి పేదల మన్ననలు అందుకుంటున్నారు.
రైస్ ఏటీఎంతో పేదల ఆకలి తీరుస్తున్న వ్యాపారి - వియత్నాం హోచిమిన్‌సిటీ
కరోనా విజృంభణ నేపథ్యంలో పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆహారం అందిస్తున్నారు పలువురు దాతలు. తాజాగా వియత్నాంకు చెందిన ఓ వ్యాపారి ఆహారం అందించటం కోసం ఓ వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు.
రైస్ ఏటీఎంతో పేదల ఆకలి తీరుస్తున్న వియత్నాం వ్యాపారి
24 గంటలూ అందించేందుకు వీలుగా ఆయన బియ్యం ఏటీఎంని ప్రారంభించారు. దీని ద్వారా ఒక్కో పేద వ్యక్తికి రోజుకు కిలోన్నర బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆలోచన నచ్చి వియత్నాంలోని ఇతర నగరాల్లోని పలువురు దాతలు రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు.