తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రైనేజీలో 13 అడుగుల నాగుపాము బుసలు..! - విదేశీ భారీ సర్పము

సాధారణ పాము కనిపిస్తేనే హడలిపోతాం. అదే అత్యంత విషపూరితమైన నాగు పాము కంటపడితే, భయంతో గుండె గుబేలుమంటుంది. అలాంటిది ఏకంగా  13 అడుగుల నాగు పాము కనిపిస్తే? అవును, సుమారు 15 కిలోల ఓ భారీ కోబ్రా థాయ్​లాండ్​లోని జనావాసాల్లో కనిపించింది. స్థానికుల సమాచారంతో అధికారులు ఆ సర్పాన్ని పట్టుకున్నారు.

డ్రైనేజీలో 13 అడుగుల నాగుపాము బుసలు..!

By

Published : Oct 15, 2019, 6:11 PM IST

Updated : Oct 16, 2019, 1:13 PM IST

డ్రైనేజీలో 13 అడుగుల నాగుపాము బుసలు..!

దక్షిణ థాయ్‌లాండ్​లోని, క్రాబీ పట్టణంలో 13 అడుగుల అరుదైన భారీ నాగు పామును సహాయక సిబ్బంది సాహసోపేతంగా పట్టుకున్నారు.

15 కిలోల బరువు, 4 మీటర్ల పొడవు ఉన్న ఈ భారీ సర్పం జనావాసాల్లోకి వచ్చేసింది. హడలిపోయిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు.

క్రాబీ పిటాక్‌ప్రాచా ఫౌండేషన్‌కు చెందిన సహాయక బృందంలో పామును పట్టడంలో నిపుణుడైన ఒకరు ఈ కింగ్​ కోబ్రాను డ్రైనేజీలో వెంబడించి మరీ పట్టుకున్నాడు. చేతులకు ఎలాంటి గ్లౌజులూ ధరించకుండా సాహసోపేతంగా సర్పాన్ని బంధించాడు.

ఈ అరుదైన కింగ్​ కోబ్రాను వన్యప్రాణుల అభయారణ్యానికి తరలించారు అధికారులు.

ఇదీ చూడండి:అమావాస్య వచ్చిందంటే చాలు.. రక్తం తాగే మనిషి!

Last Updated : Oct 16, 2019, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details