తెలంగాణ

telangana

ETV Bharat / international

పాండాకు ప్రెగ్నెన్సీ- ఆ రెస్టారెంట్ల షేర్లకు రెక్కలు - జపాన్​

తమ దగ్గరున్న పాండా గర్భవతని జూ అధికారులు ప్రకటించగానే.. దగ్గరలోని రెస్టారెంట్ల షేర్ల విలువ అమాంతం పెరిగింది. 2013, 2017లోనూ ఇలానే జరిగింది. ఇంతకీ ఎందుకలా?

panda
పాండాకు ప్రెగ్నెన్సీ..పెరిగిన రెస్టారెంట్​ షేర్లు

By

Published : Jun 4, 2021, 6:31 PM IST

పాండా గర్భవతని జపాన్​లోని జంతుప్రదర్శనశాల ప్రకటించగానే జూ సమీపంలోని రెస్టారెంట్ల మార్కెట్​ షేర్​ విలువ విపరీతంగా పెరిగింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 2013, 2017లోనూ ఇలాంటి వార్త వల్లే రెస్టారెంట్​ షేర్లు పెరిగాయి.

షిన్​ షిన్​ అనే పాండా గర్భవతని టోక్యోలోని యేనే జూ ప్రకటించింది. అంతే.. జూ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ల మార్కెట్​ షేర్లు పైపైకి దూసుకెళ్లాయి. టోటెంకో రెస్టారెంట్​ స్టాక్స్​.. ఓ దశలో ఏకంగా 29శాతం పెరిగి... చివరకు 9.4శాతం లాభంతో స్థిరపడ్డాయి.

షియోకెన్​ అనే మరో రెస్టారెంట్​ షేర్లు 8.1శాతం దూసుకెళ్లాయి​. మూడు నెల్లలో ఈ రెస్టారెంట్​కు ఇది సగటున 17 రెట్లు వృద్ధి.

2017 ఫిబ్రవరిలో షిన్​ షిన్​, రీరీ పాండాలు జతకట్టాయని ఇదే జూ ప్రకటించింది. అప్పుడు కూడా రెస్టారెంట్ల షేర్లు పెరిగాయి.

ఎంతో ముద్దుగా ఉండే పాండా పిల్లలను చూసేందుకు జూకు పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తే రెస్టారెంట్ల వ్యాపారమూ పెరుగుతుందన్న అంచనాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details