ఐక్యరాజ్యసమితిలో దిల్లీకి సంబంధించి అసత్య ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది భారత్. తప్పుడు పత్రాలు, కథనాలు సృష్టించడం ఆ దేశానికి కొత్తేమీ కాదని పేర్కొంది. ఐరాస నిషేధిత ఉగ్రవాదులు ఎందరికో పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది.
తమ దేశంలోకి భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ ఎదుట పాకిస్థాన్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఐరాసలోని భారత శాశ్వత రాయబారి ఘాటు సమాధానం ఇచ్చారు.
"పాక్ చేసే ఇలాంటి అబద్ధపు ఆరోపణలను ఎవరూ నమ్మరు. తప్పుడు పత్రాలు, కథనాలు సృష్టించడం పాకిస్థాన్కేమీ కొత్త కాదు. అంతేకాదు.. ఐరాస నిషేధించిన ఉగ్రవాదులకు ఆశ్రయివ్వటం అందరికీ తెలిసిందే. అబోటాబాద్‌లో గుర్తుంది కదా..!"