తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓకు మా బాధ చెప్పాలి: వుహాన్​ ప్రజలు

కరోనా మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్యూహెచ్​ఓ నిపుణుల బృందం మొదట తమతో మాట్లాడాలని వుహాన్​లోని​ కరోనా మృతుడి కుమారుడు జాంగ్ హాయి డిమాండ్ చేస్తున్నాడు. వైరస్ విషయంలో... జిన్​పింగ్​ ప్రభుత్వం వుహాన్ ప్రజల నోళ్లు నొక్కేసిందన్నాడు.

Relative of virus victim asks to meet WHO experts in Wuhan
డబ్ల్యూహెచ్​ఓకు మా బాధ చెప్పాలి: వుహాన్​ ప్రజలు

By

Published : Jan 26, 2021, 6:35 PM IST

Updated : Jan 26, 2021, 7:21 PM IST

చైనా​లో.. కరోనా పుట్టుకపై పరిశోధనలు జరిపేందుకు డబ్యూహెచ్ఓ బృందం సన్నద్ధమైన తరుణంలో.. పరిశోధనకు ముందు తమతో మాట్లాడాలని వుహాన్​లోని వైరస్​ మృతుడి కుమారుడు విజ్ఞప్తి చేశాడు. జిన్​పింగ్​ ప్రభుత్వం తమ నోళ్లు నొక్కేసిందని ఆరోపించాడు.

"డబ్యూహెచ్​ఓ వైద్య బృందం.. అబద్ధాలు చెప్పే ఓ సాధనంగా మారదని నేను అనుకుంటున్నా. మేము నిజం కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాము. నేరాల్ని కప్పిపుచ్చేందుకే డబ్ల్యూహెచ్​ఓ ఇక్కడి వస్తే లాభం లేదు. వుహాన్​లో నేరానికి పాల్పడ్డారు."

--జాంగ్ హాయి, కరోనా మృతుడి కుమారుడు.

జాంగ్​ హాయి వుహాన్​లో ఉండేవాడు. అతని తండ్రి కరోనా బారిన పడి గత ఫిబ్రవరిలో మరణించాడు. డబ్ల్యూహెచ్​ఓ పర్యటన నేపథ్యంలో.. తనలానే బాధకు గురైన వారిని కూడగట్టాడు. తమకు జరిగిన అన్యాయానికి అధికారులు జవాబుదారీతనంతో ఉండాలని తేల్చిచెప్పాడు.

'బయట చెబితే చంపుతాం'

కరోనా వైరస్​ వ్యాప్తి చెందిన తొలినాళ్లల్లో చైనా ప్రభుత్వం కావాలనే ఆ విషయాల్ని బహిర్గతం చేయలేదని జాంగ్​ ఆరోపించాడు. వుహాన్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనీ.. వైరస్​పైన అధిక ప్రచారం చేయవద్దని బాధిత కుటుంబాలపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నాడు.

వైరస్​పై విదేశీ మీడియాకు చెబితే తమను చంపుతామని అధికారులు బెదిరించనట్టు వివరించాడు.

తలొంచిన డ్రాగన్​

డబ్యూహెచ్​ఓ వైద్య బృందం ఎప్పుడో వుహాన్​లో పర్యటించాల్సి ఉంది. అయితే మొదట చైనా ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. అయితే చైనా చర్యపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవడం వల్ల డ్రాగన్ దేశం తలొంచింది. చివరకు ఎన్నో చర్చల తర్వాత అంగీకరించింది. జనవరి 14న వైద్య బృందం వుహాన్​కు వెళ్లగా.. 14 రోజల క్వారంటైన్​ తర్వాత త్వరలో పరిశోధన ప్రారంభంకానుంది.

ఇదీ చదవండి :కరోనా కట్టడికి చైనా ఆపసోపాలు- రాకపోకలు నిషేధం!

Last Updated : Jan 26, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details