తెలంగాణ

telangana

ETV Bharat / international

వారి శరీరాల్లో వైరస్​ సంబంధిత యాంటీబాడీలు

కొత్తగా డిశ్చార్జ్​ అయ్యే కరోనా రోగుల్లో ఎక్కువమందిలో వైరస్​కు సంబంధించిన ప్రత్యేక యాంటీబాడీలు ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్​ తయారీకి తీవ్రంగా శ్రమిస్తున్న వారికి ఈ విషయం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Recently recovered COVID-19 patients produce virus-specific antibodies'
కొత్తగా డిశ్చార్జ్​ అయ్యే రోగుల్లో ప్రత్యేక యాంటీబాడీలు

By

Published : May 5, 2020, 2:31 PM IST

కరోనా​పై విజయం సాధించి డిశ్చార్జ్​ అయ్యే అధికమందిలో వైరస్​కు సంబంధించిన ప్రత్యేక యాంటీబాడీలు, టీ కణాలు ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్​ తయారీకి ఈ ఫలితాలు ఉపయోగపడతాయి.

14 మందిపై జరిపిన పరిశోధనను ఇమ్మ్యూనిటీ జర్నల్​లో ప్రచురించారు. రోగనిరోధక శక్తి గురించి అనేక విషయాలు వెలుగుచూసినట్లు వివరించారు.

అయితే ఈ 14 మందిలోని ఆరుగురిపై.. వారు డిశ్చార్జ్ ​అయిన రెండు వారాల తర్వాత పరిశోధనలు జరిపారు. వారిలో అప్పటికీ యాంటీబాడులు ఉన్నట్టు తెలిసింది. వైరస్​లోని ఓ భాగానికి ఈ రోగ నిరోధక కణాలు ఎలా స్పందిస్తాయో కూడా గుర్తించారు పరిశోధకులు. అందువల్ల వ్యాక్సిన్​ తయారీకి వాటినే లక్ష్యంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ పరిశోధనలో చైనాకు చెందిన సింఘ్వా విశ్వవిద్యాలయం సభ్యులు కూడా పాల్గొన్నారు. కానీ బాధితుల్లోని రోగ నిరోధక శక్తి స్పందనల్లో ఎందుకు మార్పులు వస్తున్నాయనే అంశంపై స్పష్టత మాత్రం లభించలేదు.

"రక్షణాత్మక రోగ నిరోధక శక్తిని మరింత లోతుగా పరిశీలించేందుకు మా పరిశోధన ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషమంగా ఉన్న వారిలో కరోనా వైరస్​ వృద్ధి విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. సమర్థమైన వ్యాక్సిన్​ రూపొందించడానికీ ఇది ఉపయోగపడుతుంది."

--- చెన్​ డాంగ్​, సింఘ్వా విశ్వవిద్యాలయం.

వైరస్​పై విజయం సాధించిన 14మంది బాధితులు(8మంది కొత్తగా డిశ్చార్జ్​ అయిన వారు, ఆరుగురు రెండు వారాల ముందే బయటకు వచ్చినవారు ) రోగ నిరోధక స్పందనలను ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు దాతలతో పోల్చిచూశారు. వారి రక్త నమూనాలను సేకరించి ఇమ్మ్యూనోగ్లోబిన్​ ఎమ్​(ఐజీఎమ్​), ఇమ్మ్యూనోగ్లోబిన్​ జీ(ఐజీజీ) యాంటీబాడీ స్థాయిని పరిశీలించారు.

ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చితే, కొత్త డిశ్చార్జ్​ అయిన వాళ్లు, మిగిలిన ఆరుగురిలో ఐజీఎమ్​, ఐజీజీ యాంటీబాడీల స్థాయి అధికంగా ఉంది.

అయితే మనుషుల్లో సార్స్​-సీఓవీ2 యాంటీబాడీలను గుర్తించే ల్యాబొరేటరీ పరీక్షలు వాటి కచ్చితత్వం, విశ్వసనీయతను నిర్ణయించానికి మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details