ఇంతకాలం రాజకీయంగా భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల దైవం రాముడు భారతీయుడు కాదని.. రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య భారత్‌లో లేదని వ్యాఖ్యానించారు. అసలైన అయోధ్య నేపాల్‌లో ఉందని.. రాముడు నేపాల్ దేశస్థుడని ఓలి తెలిపినట్టు ఆ దేశ మీడియా కథనం ప్రచురించింది.
ప్రధాని నయా వేదాంతం.. రాముడు నేపాలీ అట! - కేపీ శర్మ ఓలి
భారత్‌కు సంబంధించి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి. హిందువుల దైవం రాముడు నేపాల్ దేశస్థుడని.. అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని ఓలి వ్యాఖ్యానించినట్టు ఆ దేశ మీడియా కథనం ప్రచురించింది.
భారత్- నేపాల్ మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా బలహీనపడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని మూడు ప్రాంతలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్‌ను విడుదల చేసింది నేపాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భారత్‌పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్ కుట్ర పన్నుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. భారత్‌తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలి పార్టీలోని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:-