స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను సెప్టెంబర్ నుంచి భారత్‌లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) వెల్లడించింది. దీంతో స్పుత్నిక్ తయారీకీ భారత్ అతిపెద్ద కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రెండో డోసు కొరత ఉందంటూ వస్తున్న నివేదికలు ఆవాస్తవమని.. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ వినియోగానికి భారత్ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది.
"రెండో డోసు కొరత ఏర్పడిందని.. దీంతో తొలిడోసు తీసుకున్న వారికి ఆలస్యం అవుతోందనే నివేదికల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్, గ్లాండ్ ఫార్మా, హెటెరో బయోఫార్మా, పనేషియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్కౌ బయోటెక్‌తో పాటు మోర్పెన్ ల్యాబ్‌లు స్పుత్నిక్ తయారీకి సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి భారీ స్థాయిలో టీకాలు అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో స్పుత్నిక్ తయారీకి భారత్ కేంద్ర బిందువుగా మారనుంది."
-ఆర్‌డీఐఎఫ్