తెలంగాణ

telangana

ETV Bharat / international

రంజాన్​ వేళ పాకిస్థానీ వీధులు కళకళ - ముస్లిం

రంజాన్​ సందర్భంగా పాకిస్థాన్​లోని ప్రముఖ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఉపవాసం, ఇఫ్తార్​ విందులు, ప్రత్యేక వంటకాలు, షాపింగ్​ ధగధగలతో మెరిసిపోతున్నాయి.

రంజాన్​ శోభతో కళకళలాడుతున్న పాకిస్థానీ వీధులు

By

Published : May 28, 2019, 9:46 AM IST

కళకళలాడుతున్న పాకిస్థానీ వీధులు

ఉపవాసాలు, ప్రార్థనలతో పాటు పవిత్ర రంజాన్​ మాసం అంటే గుర్తొచ్చేవి నోరూరించే ప్రత్యేక వంటకాలు, షాపింగ్​. పాకిస్థాన్​లో రంజాన్​ సందడి మరింత ఎక్కువ. రంజాన్​ మాసంలో రాత్రివేళ దాదాపు అన్ని ముఖ్య ప్రాంతాలు రద్దీగానే కనపడుతున్నాయి.

ఆహార ప్రియులు, షాపింగ్​ చేసే వారితో రావల్పిండి వీధులు కళకళలాడుతున్నాయి. ఇక్కడ దొరికే గాజులతో పాటు 'నిరాహి' అనే ప్రత్యేక వంటకానికి ఎంతో క్రేజ్​ ఉంది. ప్రత్యేకంగా దీని కోసమే ప్రజలు క్యూ కడతారు. పథోర, కుల్చా, శేహ్రి వంటకాలను ఎంతో ఇష్టంగా తింటున్నారు.

ఇన్ని మసాల వంటకాలు తిన్న తర్వాత... చల్లటి లస్సీ తాగితే ఆ కిక్కే వేరని దుకాణదారుడు షరాఫట్​ హుస్సేన్​ అన్నాడు.

" ఇక్కడ దేశీయ పద్ధతుల్లో లస్సీని తయారు చేస్తాం. ఎటువంటి యంత్రాలను వినియోగించం. పెరుగును చిలుకుతుంటే వచ్చే సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. దీని రుచే వేరుగా ఉంటుందని వారు అంటారు."
--- షరాఫత్​ హుస్సేన్​, దుకాణదారుడు.

రంజాన్​ మాసంలో ఇఫ్తార్​ విందు ఎంతో ప్రత్యేకం. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేదలకు ఉచితంగా ఇఫ్తార్​ విందును ఏర్పాటు చేస్తున్నాయి. వారి కళ్లల్లో ఆనందం చూస్తే మనసు ఎంతో హాయిగా ఉంటుందన్నారు ఓ స్వచ్ఛంద సహాయకుడు.

"తిండి లేని వారికి భోజనం పెడుతున్నప్పుడు వారి కళ్లలో ఆనందం కనిపిస్తుంది. రంజాన్​ మాసంలో ఇలా చేయడం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అల్లా ఆశీర్వాదాలతో దీని నుంచి అందరూ లబ్ధిపొందాలని కోరుకుంటున్నా. "
--- అకీల్​ అబ్బాస్​, స్వచ్ఛంద సేవకుడు.

ఉపవాసాలు, షాపింగ్​, ఇఫ్తార్​ విందులు... ఇవే కాకుండా పాకిస్థాన్​లో అటవిడుపులూ ఉంటాయి. అక్కడి యువత అర్ధరాత్రి దాటిన తర్వాత వివిధ ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతారు. ముఖ్యంగా క్రికెట్​ను ఎంతో ఇష్టంగా ఆడతామని తెలిపారు.

ఇదీ చూడండి: నాలుగు నెలల్లో 61 మంది భద్రతా సిబ్బంది మృతి

ABOUT THE AUTHOR

...view details